Thursday 8 August 2013

ఊపు లేని ఉద్యమమ్........


ఎహే.... ఏంటహే ఈ సప్పటి తిండి. ఎన్ని రోజులు ఇలా ఓ ఊపు జోషు లేకుండా సమైక్య ఉద్యమమ్ నడుపుతరు. కాస్త కాక పెంచండహె.

ఇప్పటికి లొల్లి షురుజేసి వారమ్ పది రోజులు దాటి పోతుంది. చూసిన విజువల్సే చూసీ చూసి బోర్ కొడుతుంది.  ఇంత వరకూ ఒక లాఠీచార్జి లేదు, టియర్ గ్యాసు లేదు. ఒక్క బుల్లెట్ పేలలేదు. ఒక్కనికి మక్కెలిర్గలేదు. గిట్ట్లయితే లాభమ్ లేదు తమ్మి.  మీ లొల్లిని ఎవ్వడు పట్టిచ్చుకోడు..... కమాన్ కమాన్...  బాయ్స్ షేకిట్ అప్. కొంచెమ్ స్పీడు పెంచాలి.

గట్లనే ఇప్పుడున్న కళాకారులకు తోడుగా మీ స్టార్ బ్యాట్స్ మెన్ ను బయటకు తేవాలి. మాజీ మంత్రి మారెప్ప నోరిప్పాలి. అయిందానికి కానిదానికి అంగి చింపుకునే బంగి అనంతయ్య ఉద్యమమ్‌లో పుంగి భజాయించాలి.  గజల్ శ్రీనివాస్ గజ్జెగట్టి పాడాలి, డక్కి గొట్టుకుంట డ్యాన్స్ చేయాలి.  తెలుగు తమ్ముడు చిత్తూర్ ఎంపీ శివప్రసాద్ మళ్ళీ పోతరాజు వేషమ్ గట్టాలి.

ఇందుకు సీమాంధ్ర యువకులంతా చొరవ తీసుకోవాలి.  ఇలాంటి  సాటిలేని మేటి నాయకులను బరిలోకి దింపి పార్టీలకు అతీతమ్‌గా ఒక జేయేసీ పెట్టుకొని సమైక్య ఉద్యమ సెగను డిల్లీకి తాకించాలని మనవి.









ఇప్పటికే సందుజూసి చిందులేసె కే"వీపీ", బీపీ పెంచుకున్న పీపీ (Parakala Prabhakar) లు ఉద్యమమ్ లో దూరిపోయారు కాబట్టి కాస్త వినోదమ్ గా ఉంది.

కానీ ఏదో వెలితిగా ఉందబ్బ..... ఏదో మిస్సింగ్.... ఏంటడి...ఏంటది?

ఆ.... యాదికొచ్చింది. రికార్డింగ్ డ్యాన్స్. పోయిన సారి సమైక్యాంద్ర ఉద్యమమ్లో లా ఈసారీ ఐటమ్ సాంగులకు రికార్డింగ్ డ్యాన్స్ లు చేపిస్తే చూపరులకు ఆటవిడుపుగా ఉంటుంది.

ఇంకేంది షురు జెయ్యిండ్రి. 

1 comment:

  1. Also don't forgot the famous "kissing scene" comedy :)

    ReplyDelete