Tuesday 13 August 2013

మీ కళకు తగ్గ గుర్తింపు దొరకడమ్ లేదు ఎంపీ గారు......

నమస్తే అన్న.... మొన్ననే మిమ్మల్ని గుర్తు చేసుకున్నామ్ అన్నా. మీలాంటి ప్రతిభాశాలి అవసరమ్ ఈనాటి ఉద్యమానికి ఎంతో ఉందన్నా. సీమాంధ్రలో మీలాంటి  కళాకారునికి  గుర్తింపు దొరకడమ్ లేదని  మీరేమ్ బాదపడకండి. మీలోని నటున్ని తెలంగాణ ప్రజలు ఏనాడో గుర్తించారు.

మీరిలాగే శక్తి వంచన లేకుండా చిత్రవిచిత్ర వేషాలు వేసి సీమాంధ్ర, తెలంగాణ ప్రజలను అలరించాలి. పార్లమెంట్ లో సమైక్యాంధ్ర సత్తా చాటాలి.

మీరు ఇంత బాగా వేషమ్ వేసినా, పద్యాలు పాడినా పక్కన గోపికలు లేక పోవడమ్ కాస్త వెలితిగా అనిపిస్తుంది. ఈసారి వేషమ్ వేసే ముందు మన అర సన్యాసి (తెలంగాణ బిల్ పాసైతే పూర్తి సన్యాసి) లగడపాటిని అడిగితే ఎలాగోలా మేనేజ్ చేస్తాడు.

మర్చిపోకండే......




1 comment:

  1. గిసొంటి డ్రామా గాళ్ళు, పగటి వేషగాళ్ళు & బూడబుక్కలోల్లు పార్ల మెంటు ల తైతక్కలాడితే ఇజ్జత్ పోతది. అసలే ఏమ్ప్తీ డ్రామారావు రోడ్డు మీద పొర్లి నంక మిగిలిన సగం పరువు ఇప్పుడు మట్టిల కలిసింది.

    ReplyDelete