Sunday, 4 August 2013

సమైక్య సన్నాసుల తమాషా చూడరబాబు :)

ఇదీ సమైక్య ముసుగులో తమాషా చేస్తున్న మన చిల్లరగాల్ల ప్రతాపమ్. ఈ రాష్టానికి చెందని వాళ్ల దగ్గర, ఈ గొడవలతో సంబంధం లేని వాళ్ల దగ్గర వీళ్లు చూపించే ప్రతాపమ్ వీక్షించండి.

షూటింగ్ కోసమ్ వచ్చిన నటులను పట్టుకొని జై సమైక్యాంధ్ర అను, జై ఇది అను, జై అది అని వేదించడమ్. గాంధేయమార్గమ్ లో నడుస్తున్న ఈ సన్నాసులు చేసిన విన్నపమ్ వినక పోతే జై సమైక్యాంధ్ర అనకపోతే ఈమె సినమాలు ఆడనివ్వరట, గాంధేయమార్గమ్‌లో శాంతియుతంగా ఈమె సినిమా రీళ్లు తగలబెడతారట...

హుమ్..ఆంధ్రా సంసృతి.


2 comments:

  1. కేవీఆర్ శర్మ8/04/2013

    నాది ఆంధ్ర అండి (గుంటూరు). నేను చెప్తున్నాను ఇక్కడి ప్రజలకు ఎవరికి తెలంగాణ ఇవ్వడం పై అభ్యంతరాలు లేవు. మేము ఆందోళన చెందుతున్నది అంతా మా భవిష్యత్తు గురించే. దాని గురించి ఏ రాజకీయ నాయకుడు మాట్లాడడం లేదు. మా నాయకులంతా వాళ్ళ రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుకుంటున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజల కోసం ఎవరూ ఆలోచించడం లేదు. ప్రతి చిన్న నాయకుడు పెద్ద నాయకుడు కూడ దీన్నో అవకాశంలా వాడుకుంటున్నారు.



    మా అమ్మాయి GVR&S junior college లో చదువుకుంటుంది. నిన్న రాయపాటి అనుచరులు కాలేజీకి వచ్చి బెదిరించి అందరు పిల్లలను తీసుకెళ్ళారట. రాయపాటి బ్యానరు ముందుపెట్టి వీళ్ళతో ప్రదర్శన చేయించారట. వీళ్ళసలు మనుషులేనా అనిపించింది.

    ఒక్కసారి చూడండి. రోడ్లపై ఆందోళన చేస్తున్న వాళ్ళు అంతా విద్యార్థులే తప్ప ప్రజలు కాదు అని గమనించండి. ఎక్కడైనా ఎదే వరుస. వీళ్ళ సమైక్యాంధ్ర గొడవలో మా ప్రాంత ప్రయోజనాలను ఎవరు పట్టించుకోవడం లేదు.

    ReplyDelete
  2. Anonymous8/13/2013

    రాజకీయ నాయకుల సంస్కృతిని ఆ ప్రాంత సంస్కృతులకి అంటగట్టడం సరికాదు, అర్థరాత్రిదాకా తాగి మధ్యాహ్నం నిద్రలేచి నోటికొచ్చినట్లు మాట్లాడే తెలంగాణ నాయకుడి సంస్కారం తెలంగాణా సంస్కృతి ఎలా కాదో, కొందరు రాజకీయ నాయకులు చేసే సంస్కారహీనమైన పనులు ఆంధ్ర సంస్కృతీ కాదు. ఏ జిల్లాకి ఆ జిల్లా ఏ ప్రాంతానికాప్రాంతం సంస్కృతి వేరుగా ఉంటుంది సంస్కృతి సంస్కారాన్ని నేర్పుతుంది తప్ప కుసంస్కారాన్ని కాదు. ఏమైనా తెలంగాణ అనివార్యం. తెలంగాణ అడగడంలో దాని చరిత్ర తెలిసినవారికెవరికైనా న్యాయంగానే తోస్తుంది. ఎవరూ వ్యతిరేకించరు. అసలు గొడవకి ycp కారణం కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పార్టీ నిర్ణయం తీసుకుంటుంటే మధ్యలో సీమాంధ్రలో గొడవ చేసి మైలేజ్ కొడ్దామని ప్రయత్నించి ఉద్యమాన్ని సృష్టించి పోషించింది ఏదో మీ కాంగ్రెస్ ఇంట్లో మాకిష్టం లేని పప్పు చేస్తున్నారు కాబట్టి మా వైకాపా యింట్లో అన్నం వండుకోం లాగా అసంబద్ధ ఉద్యమం లేవనెత్తింది... తరవాత ఇతర కాంగీయులు ఆ బాట పట్టారు. తెలంగాణ ఇవ్వండి, కానీ సీమాంధ్రకు కూడా వారిక్కావలసినవివ్వండి అనడుగుతున్న టిడిపినే బెటర్ అన్పిస్తోంది....

    ReplyDelete