Saturday, 3 August 2013
ఆంధ్రా కాపిటల్: డేరా నగర్.......
కేంద్రప్రభుత్వమ్ తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు చాలా స్పష్టమైన ప్రకటన చేసినా మన సీమాంధ్ర నాయకులు ఇంకా సమైక్యాధ్ర పేరుమీద ప్రజలను మభ్యపెడ్డడమ్ మానలేదు. ఇప్పుడు కూడా ఇంకా తెలంగాణను అడ్డుకుంటామ్, రాష్త్రాన్ని ముక్కలు కానీయమ్ అని బీరాలు పోతున్నరు. వీళ్లు ఇంకా కళ్లు తెరుచుకోకుండా జరుగుతున్నది అర్థమ్ చేసుకోకుండ స్వంతప్రయోజనాలతో రాజకీయాలు చేస్తే సీమాంధ్రకు మిగిలేది చిప్పే.
రాయలసీమ వాళ్లు ఇప్పటికే లబలబలడుతున్నారు ఆంధ్రనాయకుల మాటలు విని సంకనాకిపోయాము అని. ఇప్పుడైన సోయి తెచ్చుకొని వాళ్ళ అభివృద్దికి ఏమ్ కావాలో కేంద్రానికి విన్నవించుకోక పోతే జరిగే నష్టానికి వాళ్లే భాద్యులవుతారు. పైకి రాష్ట్రాన్ని సమైక్యా ఉంచడానికి ఇంకా ప్రయత్నిస్తున్నమ్ అని చెప్తున్న ఆంధ్రా నాయకులంతా అధిష్టానమ్ పెద్దల దగ్గర కొత్తరాష్ట రాజధానిని విజయవాడలో ఏర్పాటు చేయాలి అని లాబీయింగు మొదలు పెట్టారు. రాయలసీమ నాయకులు రాజధాని కోసం ప్రయత్నించపోతే ఆ ప్రాంత ప్రజలు క్షమించరు.
ఆంధ్ర రాష్రమ్ ఏర్పడ్డప్పుడు ఇలాగే మద్రాసు మాకే కావాలి అని మంకు పట్టు పట్టి రాజాజి తంతే కర్నూలు వచ్చి పడ్డారు. అప్పటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని వైభవాన్ని వివరించడానికి ఈ బ్లాగు చాలదు. కానీ కొన్ని మధుర జ్ఞాపకాలు మీకోసమ్.
అప్పటి రాజధానిని ముద్దుగా "టెంట్ కాపిటల్", "గుఢారల గూడెమ్", "డేరా నగర్" అని పిలుచుకునేవారట :)
అప్పటి జ్ఞాపకాలను తలుచుకోని సీమాంధ్రులు బెంగపడొద్దని మనవి. ఎందుకంటే ఇప్పుడు మనమ్ చాల అభివృద్ధి చెందామ్. గుఢారాలకు కాలమ్ చెల్లిపోయింది. కిరణ్ సారు మీకు ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ బిల్డింగ్ లాంటివి కట్టి గుఢారాలల్లో సంసారానికి దూరమ్ గా చేస్తడని మా ఫ్రగాడ విశ్వాసమ్.
కాదూ కూడదు ఇందిరమ్మ ఇల్లు మాకొద్దు, గుఢారాల్లోనే ఉంటామ్, గుడిసెల్లో ఆఫీసులు నడిపిస్తామ్ అంటారా, సరే అలాగే కానివ్వండి.
సీమాంధ్ర జనాలకో ఉచిత సలహా, ఇప్పటికైనా మీకేమ్ కావాలో కేంద్రాన్ని అడగకుండా ఇలాగే మీ కొంపలు కాల్చుకోని కొట్టుకుంటుంటే మట్టిగొట్టుకు పోతరు.
Subscribe to:
Post Comments (Atom)
Anna, enni rojulaku vachinave???
ReplyDeleteIka uthiki areyyi.
jai telangana!!!!!