హైదరాబాద్ : సీమాంధ్రలో సమైక్య ఉద్యమమే లేదు అని
ఆంధ్రా ప్రాంతానికి చెందిన దళిత, బహుజన ఉద్యోగులు స్పష్టం చేశారు. కొంత
మంది పెట్టుబడుదారులు, అగ్రకులాల వారు మాత్రమే కృత్రిమ ఉద్యమాన్ని
నడుపుతున్నారని తెలిపారు. ఏపీ ఎన్జీవోల, సీమాంధ్ర బడాబాబుల నాటకాలు
బట్టబయలు చేస్తామని తేల్చిచెప్పారు. వ్యాపార ప్రయోజనాల కోసమే సీమాంధ్ర
నేతలు రాజీనామాలు చేస్తున్నారని చెప్పారు. ఈ నెల 10న ఒంగోలు బహిరంగ సభ
ఏర్పాటు చేసి ఏపీఎన్జీవోల నాటకాలు బయటపెడుతామని స్పష్టం చేశారు. ఏపీ
ఎన్జీవోలు ఇప్పటికైనా కపట నాటకాలు కట్టిపెట్టి రాష్ట్ర విభజనకు సహకరించాలని
కోరారు. రాష్ట్ర విభజన కోరుతూ దళితులు, బహుజనులు ర్యాలీలు, నిరసనలు
చేపట్టినా మీడియా చూపటం లేదు అని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన కోసం
ఆందోళనలకు దిగుతామని స్పష్టం చేశారు. ఏపీ ఎన్జీవోల సమ్మెలో ఎస్సీ, ఎస్టీ
ఉద్యోగులు పాల్గొనరు అని తేల్చిచెప్పారు. సమ్మెకు సహకరించకుండా యథావిధిగా
విధులకు హాజరు కావాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
అంబేద్కర్ ఆశయం చిన్న రాష్ట్రాల ఏర్పాటు.. అదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
(Courtesy: Namasthe Telangaana)
How funny.
ReplyDelete