Tuesday, 6 August 2013

మన బాద్‌షా బ్రహ్మీ.........

ఈ మధ్య వచ్చిన బాద్‌షా సినిమా చూసిన వాళ్లకు అందులో బ్రహ్మానందమ్ కామెడీ గుర్తుండే ఉంటుంది. చిన్న రామారావు తన పథకమ్ కోసమ్ ఓ బకరాని వెతుకుతుంటే అన్ని లక్షణాలు సరిపోయేట్టు బ్రహ్మీ తగులుతాడు. బ్రహ్మీని నువ్వు డ్రీమ్ లోని వెళ్లిపోతున్నావు నీ డ్రీమ్ లో నువ్వే కింగు నీకు ఎదురు లేదు అని ఓ కుర్చీ మీద కూర్చోబెట్ట్లి రెచ్చగొట్టి తెరచాటున పనులు చక్కబెడతాడు.




ఇప్పుడు మన రాష్టమ్‌లో అధిష్టానమ్ కిరణ్ గారితో అచ్చమ్‌గా ఇలాంటి ఆటనే ఆడించింది. ఏపీలో తమ కథ నడిపించడానికి అచ్చమైన బకరాని వెతుకుతుంటె కిరణ్ గారు అన్ని విధాలా యోగ్యుడిలా కనిపించాడు. రాష్ట్రమ్ మీద పట్టులేదు, ప్రభుత్య పనితీరుపై అవగాహన లేదు. అంతెందుకు గతమ్ లో మంత్రిగా పనిచేసిన అనుభవమ్ కూడా లేదు.  ఇలాంటి వాడైతే పర్ఫెక్ట్‌గా పనికొస్తాడని పిలిచి నీకు ఎదురు లేదని నువ్వే కింగువని చెప్పి సీఎమ్ కూర్చిలో కూర్చోబెట్టి కలల లోకమ్‌లోకి పంపింది.



అంతే కిరణ్ గారు రెచ్చిపోయారు. రాగానే  బొత్సాను మద్యమ్ కుంభకోణమ్ లో ఇరికించాడు, శంకర్ రావును అరెస్ట్ చేయించాడు, డీఎల్ రవీందర్ బర్తరఫ్ చేసాడు, తను మొండి వాన్ని అని తనకుతానే సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు, భూకంపమ్ సృష్టించు చుద్దామ్ అని తెలంగాణ నాయకులకు సవాల్ విసిరాడు. అంతటితో ఆగక అసెంబ్లీ సాక్షిగా "రాసిపెట్టుకో తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనూ ఏమ్ చేస్తావో చేసుకో అని" అని విర్రవీగాడు. ఒక కలల ప్రపంచమ్‌లో విహరించాడు.

కానీ ఇప్పుడో......అయిపోయింది. అంతా అయిపోయింది. ఇప్పటి వరకు జరిగింది అంతా కల కాదని తెలిసిపోయింది.  హీరో ఎవరో కమేడియ ఎవరో ఫుల్ క్లారిటీ వచ్చింది. బకరా ఎవరో బాద్‌షా ఎవరో బాగానె అర్థమ్ అయింది. పులిలా ఊహించుకున్న తనను అధిష్టానమ్ అసలు పిల్లిలా కూడా చూడడమ్ లేదని తెలిసిపోయింది.

పాపమ్....... "లే లే లే నా రాజా" అని సమైక్య ఉద్యమాన్నిఎంత లేపాలని చూసినా లేవడమ్ లేదే?

5 comments:

  1. Anonymous8/06/2013

    పోలిక అదిరింది.

    ReplyDelete
  2. Excellent comparision! In future please publish some more analogies like this. We will enjoy

    ReplyDelete
  3. Anonymous8/06/2013

    Meeru Sreenu Vaitla Tammudaa...?? Adaragottaaru...!!

    ReplyDelete
  4. Anonymous8/06/2013

    Adirindi... Brother..!!

    ReplyDelete