Monday, 5 August 2013

హైదరాబాద్ లో విశాలాంధ్ర వారి భారీ సభ !!!!

పరకాల ప్రభాకర్.... గీ పేరు యాదికుందా?

ఏందీ గప్పుడే యాదిమర్చి పోయిండ్రా?

గదే గిప్పుడు తద్దినమ్ పెట్టుకున్న ప్రజారాజ్యమ్ పార్టీకీ ఒకప్పుడు ఫ్రంట్ పేసు, "సామాజిక బేరమ్" గిట్టుబాటు గాగ బయటకు వచ్చి ఎవరూ దగ్గరికి రానివ్వక పోతే తానే ఒక సొంత కుంపటి పెట్టుకుని ఊళ పుట్టినప్పుడల్లా జై సమైక్యాంధ్ర అంటాడు, అప్పుడప్పుడు వార్డు మెమ్బరు ఎమ్మెల్సీ లకు పోటీ చేస్తుంటాడు, అమాస పున్నానికి పది మంది పనోల్లను వెంటేసుకొని జై విశాలాంధ్ర అంటడు, "లైక్ మైండెడ్" జనాలతో డిల్లీ స్థాయిలో సభలు నిర్వహిస్తుంటాడు, ఫొటోలు తీసుకొని వెబ్ సైట్లో, విడియోలు తీసుకొని యూటూబ్లో పెట్టి తెలుగు జాతిని ఓ వెలుగు వెలిగిస్తుంటాడు, ప్రణవ స్కూల్లో తెలుగు భాష గొప్పతన్నాన్ని ఇంగ్లీష్లో చెప్తుంటాడు.........

యాదికొచ్చిందా...??

ఆ....ఆయనే పరకాల ప్రభాకర్ గారు, సింపుల్ గా PP.

ఈ పీపీకి సారీ పీపీ గారికి (ఎంత పీపీ అయితే మాత్రమ్ సంభోధనలో గౌరవమ్ తగ్గొద్దుకదా) మొన్న తెలంగాణ ప్రకటన రాగానే సహజంగానే హైదరాబాదులో బ్రహ్మాండమైన విశాలాంద్ర సభ పెట్టి తన సత్తా చాటలనిపించింది. వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్లి, నేను పీపీని ఏపీని ఏకంగా ఉంచడానికి సభ పెడతాను అనుమతి ఇవ్వండి అంటే వాళ్లు చేయి ఖాళీ లేదు, మళ్లీ రమ్మన్ని చెప్పారు. ఏంటీ నాకే అనుమతి ఇవ్వరా, నా హక్కులనే కాలరాస్తారా, నేనంటే ఏమనుకుంటున్నారు నేనెవరుకుంటున్నారు.... పీపీని అని బీపీ పెంచుకొని హెచ్చార్సీ వద్దకెళ్లాడు. ఆయనేమో హక్కులేదు తొక్కలేదు ఏది హెచ్చార్సీ కిందికి వస్తుందో ఏది రాదు తెలుసుకోకుండా మాదగ్గరికి వచ్చి మా టైమ్ ఎందుకు ఖరాబ్ చేస్తరని తిట్టి పంపారు.

అయినా పంతమ్ నెగ్గాల్సిందేనని లేకపోతే ఇజ్జత్ పోతదని నిన్న ఆదివారమ్ ఒక బ్రహ్మాండమైన్ సభ పెట్టి అశేషజనవాహినితో విజయవంతమ్ చేసాడు.

ఇంత కష్టపడ్డా ఆయనకు తగినంత మైలేజీ వస్తుందో రాదో అని ఈ బ్లాగు ద్వారా కాస్త ప్రచారమ్ కలిపిస్తున్నాము.





ఈ పీపీ గారు ఇలాంటి సభలు మరెన్నో పెట్టాలి అని పీపీ అభిమానుల జేయేసీ తరుపున డిమాండ్ చేస్తున్నాము. 

1 comment:

  1. ఈయనకున్న కళలు అన్నీ ఇన్నీ కావు. ఏ సభలో ఎంత మంది ఉన్నారో ఫోటోలు చూసి అంచనా వేయగల మేటిదిట్ట. ఆ మధ్య తెలంగాణా మార్చుకు ఎవ్వరు రాలేదని మస్తు లొల్లి చేసిండు.

    మీరు పైన ఉంచిన రెండు చదరపు అంగుళాల చిన్న ఫోటో లోపల 14 మంది ఉంటె రెండు కిలోమీటర్ల పొడువున్న టాంకుబండు మీద ఎందరు ఉండాలనే లెక్క మస్తుగా చేసి చూపిస్తడు.

    14 guys in 2 sq. in = 7/sq. in
    2 km (length) = 2 X 3,280= 6,560 feet = 78,720 inches
    100 feet (width) = 1,200 inches
    Tankbund area= 78,720 X 1,200 ~ 9.45 crore sq. in
    People protesting Telangana= 9.45 X 7 = 66 crores

    అన్టేంది, దేశం జనాభాలో చంటిపిల్లలు & పండు ముసలోళ్ళు తప్ప అందరూ టాంకుబండు వచ్చి ప్రభాకర్ ఎనకాల నిలబడ్డరు. నమ్మకపోతే మల్ల లెక్కలు చెప్తడు. ఆయన లండన్లో చదివిండు ఏర్కలేదా వారీ.

    ReplyDelete