Monday 19 August 2013

హైదరాబాద్ అభివృద్దిలో ఆంధ్రోల్ల పాత్ర.........

ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, బ్లాగుల తో పాటు ఏ సోషల్ మీడీయలో చూసినా ఊపు లేని ఉద్యమమ్ మీదా లెక్క లేనన్ని సెటైర్లు కనబడుతున్నాయి. ఇది చాలా సంతోషకరమైన, ఆహ్వానించదగ్గ పరిణామమ్. ప్రజాబలమ్ లేకుండా కేవలమ్ రాజకీయ కూలీలు చేసే ఏ పనులకైనా ప్రజల నుండి స్పందన ఇలాగే ఉంటుంది అన్నది మనకు మరో సారి ఋజూవైంది.


 

తెలంగాణను డెవలప్ చేసామని తోక తెగిన కోతుల్లా తైతక్కలు ఆడుతున్న ఆంధ్రోల్లు,  ఇదే సందుగా  అడ్డగోలు వాదనలు చేస్తున్న బుడ్డగోచీ నాయకులు ఒకటి గమనించాలి,  వీళ్లు వదిలి వచ్చింతర్వాతనే శని వదిలినట్లు మద్రాస్ చాల డెవలప్ అయింది. కానీ వీళ్ల రాకతో హైదబాద్ అభివృద్ది చాలా కుంటుపడింది.  అందుకని గత యాబై సంవత్సరాలలో మద్రాస్ లో జరిగిన అభివృద్ధిని హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధితో పోల్చి ఇక్కడ అభివృద్దిలో ఏమాత్రమ్ తగ్గుదల కనిపించినా దాన్ని కొత్తగా ఏర్పడబోయే ఆ.ప్ర. ప్రభుత్వమ్ నుండి వసూల్ చేయాలి.  

ఇప్పుడు కొత్త రాష్ట్రానికి రాజధాని లేక కిరాయి బతుకు బతకడానికి రెడీ అయిన సీమాంధ్ర ప్రభుత్వమ్ నుండి రాజధాని అద్దె కింద వేల కోట్లు తీసుకోవాలి.  ఇది ఇన్ని రోజులు వీళ్లు చేసిన పాపలకు ప్రాయశ్చిత్తమ్ గా ఉంటుంది.  వాళ్లకూ కాస్త ఆత్మ సంతృప్తిని ఇస్తుంది.  అత్మాభిమానమ్ చంపుకోని బ్రతకడమ్ వీళ్లకు కొత్త కాదు కాబట్టి రాబోయే పదేళ్ల వరకు వీళ్లు ఇక్కడే తిష్ట వేస్తారు. అందులో ఎలాంటి సందేహమ్ లేదు.

కాదూ కూడదు అంటే కర్నూల్  కాపిటల్ ను ఒక్కసారి గుర్తు చేయాలి..... గుడిసెలు.... గుడారాలు.... అసలే ముక్కిడి మొకమ్ అంటే అండ్ల దగ్గు పడిశమ్ అన్నట్లు పైనుండి వాన దాంతో నేలంతా బురద.  ఈ కష్టాలు చాలవన్నట్లు పందులు వచ్చి ఫైల్స్ ఎత్తుకెళ్లడం. ఇప్పుడు అలా పందులు రాకుండా ఉండడానికి కొంత మంది పనోళ్లను పెట్టుకోవచ్చనుకో. ఈవిధమ్ గా యువతకు ఉపాది కల్పించినట్లు కూడా ఉంటుంది అంటారా...... సరే కనివ్వండి. వాళ్లిష్టమ్ మనమెందుకు అడ్డుపడడమ్.

ఉందిలే మంచికాలమ్ ముందు ముందునా........

Friday 16 August 2013

ఇదీ సమైక్యాంధ్ర పేరు మీద నడుస్తున్న అసలు తంతు.......

ఇదీ సీమాంధ్రలో జరుగుతున్న తంతు...........


ఎవడి ఆక్టింగులు వాడు చేస్తున్నాడు. ఎవడి ఆంగిల్ వాడిది.........

ఈ సమైక్యాంధ్ర ఉద్యమేమో కాని రోజు పొద్దున్నుండి రాత్రి దాక వీళ్ల కామెడీ చూడడమ్ కష్టంగా ఉంది. ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమమ్ చూసిన కొంత మంది ఉద్యమమ్ అంటే ఇలా చేయాలి అని నేర్చుకొని కొంత వరకు కాపీ బాగానే కొట్టారు. కానీ కాపీ కొట్టడానికి కూడా తెలివుండాలి. లేక పోతే నవ్వుల పాలైతారు. హకల్ సే నకల్ మారొ అని అందుకే చెప్పారు.

అన్ని కాపీ కొట్టడమ్ ఐపోయింతర్వాత ఇప్పుడు ఏమ్ చేయాలో దిక్కుతోచడమ్ లేదు. ఎప్పుడు వెంటపడి తిరుగుతున్న కెమరా వాళ్లు ఏదో ఒకటి చేయకపోతే వదిలేట్లు లేరు. అందుకని ఏ పని చేసినా దానే సమైక్యాంధ్ర కోసమ్ నిరసన అనుకుంటే సరి అని కొత్త కామెడీ షురు జేసిండ్రు. ఈ కామెడీల్లో నుండి మచ్చుకు కొన్ని:

సమైక్యాంధ్ర కోసమ్ నిద్ర లేవడమ్
సమిక్యాంధ్ర కోసమ్ చెరువు గట్టుకు వెళ్లడమ్
సమైక్యాంధ్ర కోసమ్ స్నానాలు చేయడమ్
సమైక్యాంధ్ర కోసమ్ అన్నమ్ తినడమ్
సమైక్యాంధ్ర కొసమ్ డైటింగ్ చేయడమ్
సమైక్యాంధ్ర కోసమ్ సైకిల్ తొక్కడమ్
సమైక్యాంధ్ర కోసమ్ యోగా
సమైక్యాంధ్ర కోసమ్ ముగ్గులు
సమైక్యాంధ్ర కోసమ్ పెగ్గులు
సమైక్యాంధ్ర కోసమ్ మంత్రుల ఝండా వందనమ్
సమైక్యాంధ్ర కోసమ్ రాజీనామాలు
సమక్యాంధ్ర కొసమ్ ప్రజలకు పంగనామాలు

"నాతో మాట్లాడడమే నీకు ఎడ్యుకేషన్" అన్నట్లు మేమ్ ఏమ్ చేసినా అది సమైక్యాంధ్ర నిరసనే అంటే కాస్త నవ్వొస్తుంది.
వీల్లకు సరిగ్గా సరిపోయేట్లున్న మీడియా..... అది ఏమ్ చూపినా సమైక్యాంధ్ర కోసమే. ఎవడు ఎలా చచ్చినా అది సమైక్యమ్ కొసమే.





ఈ మాత్రమ్ సింగారానికి అధిపత్య పోరొకటి. ఉద్యమమంటే మా కులపోడే చేయాలి అని కొందరు, లేదు మా పార్టీ వాడే చేయాలి అని మరి కొందరు, కాదు కాదు మా లీడరే చేయాలి మరెవరు చేయడానికి వీళ్లేదు అని ఇంకొందరు. కాదంటే తడకా చూపించి తాట తీయడానికి కూడా వెనకాడడమ్ లేదు. 



ఈ సారి ఉద్యమమ్ లో ఎక్కువగా కనబడుతున్నది, ఒక రకమ్‌గా చెప్పాలి అంటే ముందుండి నడిపిస్తున్నది హిజ్రాలు. "సమైక్యాంధ్ర హిజ్రాల జేయేసీ" ఒకటి పెట్టి సమైక్యాంధ్ర వాదులను ఏకమ్ చేయాలని మనవి. 

ఈ మిధ్యమమ్ వేడి అప్పుడే చల్లరినట్లు ఉంది. మొన్నటి వరకు న్యూస్ పేపర్లల్లొ ప్రంట్ పేజీలో కలర్ ఫొటోలు వచ్చేవి, తర్వాత మధ్య పేజీలోకి వెళ్లి పోయాయి. ఇప్పుడు కలర్ ఫోటోలు కాస్తా బ్లాక్ అయిండ్ వైట్ కు మారిపోయాయి. రేపు పూర్తిగా కనబడకుండా పోతాయి. అలా రాష్ట్రమ్ లో జరిగిన కొన్ని అల్లర్లు చరిత్ర పుటల్లో కలిసి పోతాయి.

ఆవేశ పడడమ్ లో తప్పులేదు కానీ ఆ అవేశానికి అర్థమ్ లెక పోతే ఉద్యమానికి ఓ దశ దిశ అంటు ఉండవు. అప్పుడు సమైక్యాంధ్ర కోసమ్ సంకనాకి పోవల్సి వస్తుంది.


Thursday 15 August 2013

మీ తెలుగు తల్లికి మల్లె పూదండ..........

Remembering again...........









చరిత్ర మరచిపోయిన మిత్రుల కోసమ్: మా తెలుగు తల్లికి పాటను సుందరాచారి గారు ఓ సినిమా కోసమ్ రాస్తే అది ఆ నిర్మాతకు నచ్చలేదు. అప్పటికే ఓ తల్లిని సృష్టించిన ఆంధ్రా నాయకులు ఈ పాటలోని డెప్త్ ను పసిగట్టి ప్రాచుర్యమ్ కలిగించారు. అలా సినిమా పాటనే సీమాంధ్ర జాతీయ గీతమ్ గా మారింది.



Wednesday 14 August 2013

దీనికి ట్రాన్స్‌లేషన్‌ అక్కర్లేదు సార్....కావలసింది ఎక్స్‌ప్రెషన్!!!!!!

నిన్న మన నాయకులు జంతర్ మంతర్ దగ్గర కామెడీ చేయడానికి రెడీ అయితే ఆ మాత్రమ్ కామెడీకి అక్కడి దాకా ఎందుకు ఇక్కడే పార్లమెంట్ ఆవరనలోనే చేసుకోండని అధిష్టానమ్ తగురీతిలో చెప్పడమ్ తో అక్కడే గజ్జెగట్టి ఇజ్జత్ కాపాడుకున్నరు. 

అయితే డిల్లీలో ఉండే హిందీ వాళ్ళకు వీళ్ల తెలుగు చప్పుల్లు వినబడతాయ అని ఎవరు అనుమానపడొద్దు.  మొన్న  హరికృష్ణ గారు సెలవిచ్చినట్లు, ట్రాన్స్‌లేషన్ తో పని లేదు ఎక్స్‌ప్రెషన్ ఉంటే చాలని  కెమరాల ముందు దుమ్ము రేగే ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు.  ఫోటోలకు పోజులిచ్చి, విడియోలకు కావలసిన విజువల్స్ ఇచ్చి తంతు ముగించారు.

ఇందులో  మన మెగస్టార్ గారిది మాత్రమ్ వెరైటీ  వ్యవహారమ్.  "తటస్తుడిగా" ఉండాలని ఎంత ప్రయతించినా ప్రజలు తన్నేట్లు ఉన్నారని మందలో కలవకుండా ఉండలేని పరిస్థితి.  అంటీ ముట్టనట్లు వ్యవహరించి నటనలో మెచ్యూరిటీ చూపకపోయినా తతిమా నాయకులు మాత్రమ్ నటనలో జీవించారు.




పొద్దంతా టీవీల్లో చూసారు కదా...... మరెందుకు ఆలస్యమ్. వీళ్ల ఫర్పార్మెన్స్ మీకు నచ్చీతే "ఆంధ్ర  420" అని టైప్ చేసి మీ ఇష్టమ్ వచ్చిన నంబర్‌కు SMS చేసుకోండి.

Tuesday 13 August 2013

ఇదీ ఈ తెలుగు తమ్ముడి అసలు రూపమ్........

నిన్న రాజ్యసభలో  తెలుగు తమ్ముళ్లు చేసిన రభస చాలా కనువిందు చేసింది. కేవలమ్ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని స్పీకర్‌తో  చివాట్లు తిన్నా ఏమాత్రమ్ సిగ్గు పడని వీళ్ల ఆత్మగౌరమ్ అబ్బురపరిచింది. హరికృష్ణ ఆవేశమ్ బూడిదలో పోసిన పన్నీరైనా పది నిమిషాలు నిలబడి మాట్లాడిన ఆయన ఫిట్‌నెస్ ఆశ్చర్యపరిచింది.


మొన్న సృహ తప్పినట్లు నటించి డ్రామ రక్తికట్టించిన సీయమ్ రమేష్  నిన్న మళ్లీ ఆ నాటకమ్ వేయలేదు.  కే వీపీ సార్దక నామధేయుడు అనిపించుకున్నాడు.

పేరు మోసిన  ఆంధ్రా దళారి సుజనా చౌదరి  కథలు ఎన్నిచెప్పుకున్న తక్కువే. దానికీ బ్లాగు సరిపోదు. ఈయన గారి దొంగ వ్యాపారాలు తెరచాటు వ్యవహారాల గురించి ఆంధ్రజ్యోతి పుంఖాను పుంఖానలుగా కథనాలు ప్రచురించింది. అందులొని కొన్ని వార్తలు మీకోసమ్....



12/3/2009



13/3/2009




14/3/2009


15/3/2009

మీ కళకు తగ్గ గుర్తింపు దొరకడమ్ లేదు ఎంపీ గారు......

నమస్తే అన్న.... మొన్ననే మిమ్మల్ని గుర్తు చేసుకున్నామ్ అన్నా. మీలాంటి ప్రతిభాశాలి అవసరమ్ ఈనాటి ఉద్యమానికి ఎంతో ఉందన్నా. సీమాంధ్రలో మీలాంటి  కళాకారునికి  గుర్తింపు దొరకడమ్ లేదని  మీరేమ్ బాదపడకండి. మీలోని నటున్ని తెలంగాణ ప్రజలు ఏనాడో గుర్తించారు.

మీరిలాగే శక్తి వంచన లేకుండా చిత్రవిచిత్ర వేషాలు వేసి సీమాంధ్ర, తెలంగాణ ప్రజలను అలరించాలి. పార్లమెంట్ లో సమైక్యాంధ్ర సత్తా చాటాలి.

మీరు ఇంత బాగా వేషమ్ వేసినా, పద్యాలు పాడినా పక్కన గోపికలు లేక పోవడమ్ కాస్త వెలితిగా అనిపిస్తుంది. ఈసారి వేషమ్ వేసే ముందు మన అర సన్యాసి (తెలంగాణ బిల్ పాసైతే పూర్తి సన్యాసి) లగడపాటిని అడిగితే ఎలాగోలా మేనేజ్ చేస్తాడు.

మర్చిపోకండే......




Monday 12 August 2013

అసలైన సీమాంధ్ర JAC.......






మీరు సూపరెహే.....
ఇలాంటివి ఇంకో పది సంఘాలు పెట్టాలని అభిమానుల కోరిక.

పోటీలో వెనకబడకుండా ఉండడానికి ఆంధ్ర దొంగల జేయేసి....ఆంధ్ర దోపిడిదార్ల జేయేసీ లాంటివి కూడా రావాలని కోరుకుంటున్నాము. 

గాదె కింది పందికొక్కులు.......

సకలజనుల సమ్మె చేసినప్పుడు కూడా సచివాలయమ్ లో పని అటకెక్కలేదు. కానీ ఇప్పుడు సీమాంధ్ర ఉద్యోగులు పని ఎగ్గొట్టడమ్ తో ఇంచుమించు పనంతా ఆగిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్నదంతా సీమాంధ్రులే కదా మరి. ఇన్ని రోజులు సిగ్గులేకుండా  తెగ మింగింది కాకుండా ఇప్పుడు సమ్మె పేరుతో డ్రామాలు షురు జేస్తున్నరు.



ఇప్పటి వరకు  ఉద్యోగుల లెక్కలు తీయండి అంటే ఎవరు తీయలేదు. కానీ ఇప్పుడు కేంద్రమ్ పొగబెడితే గాదె కింది పందికొక్కులన్నీ బయట పడ్డాయి. వీళ్లని చూసి దిమ్మతిరిగిన తెలంగాణ ఉద్యోగులు వామ్మో ఇంతమంది ఉన్నారా అని ఆశ్చర్య పోతున్నారు.

తిన మరిగిన ఈ దొంగలను మంచిమాటతో వెళ్లమంటే ఎలా వెళతారు. మన పిచ్చిగాక పోతే.  ఇప్పటి వరకు బయటకు వచ్చిన సెక్రటేరియట్ లోని కొన్ని ఉద్యోగాల లెక్కలు ఇక్కడ ఇస్తున్నాము. ఇవి కేవలమ్ టిప్ ఆఫ్ ది ఐస్ బర్గ్. ఒక్కసారి కేంద్ర హోమ్ శాఖ జోక్యమ్ చేసుకొని ఉద్యోగుల అసలు లెక్కలు బయటకు తీస్తే ఇంకెంత మంది దొంగనా ఉద్యోగులు బయట పడతారో చూడాలి.

Post   (Total Andhra employs - Total Telangana employs)
=========================================
Additional secretary  (13-1)
Joint secretary (26-3)
Asst secretary  (188-45) 
Section officer (609-117)
Asst section officer (1200 235)
Private secretary (77-13)
Special category (20-3)

And so on ....


Friday 9 August 2013

సార్ మీరు కామెడీ హీరో.... మీకంత సీన్ లేదు......


మీరేదొ ఊహించుకొని కామెడీ చేస్తున్నారు కానీ మీకంత సీన్ లేద్ బాస్. ఎన్నడెక్కనొన్ని ఎద్దు ఎక్కిస్తే ఏమైతదో మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. అధిష్టానమ్ దెబ్బకు కోలుకొని కెమరా ముందుకు రావడానికే  పది రోజులు పట్టింది. అలాగే రేపు ప్రజల ముందుకు కూడా వస్తే వాళ్లేంటో చూపిస్తారు. అంతదాక ఓ డైజిన్ టాబ్లెట్ వేసుకొని చెద్దర్ కప్పుకొని పడుకోండి. కాస్త కడుపు మంట తగ్గుతుంది. 







హైదరాబాదీని అని చెప్పుకునే మీ నిస్సిగ్గు అసలు రూపమ్ ఈ రోజు తెలంగాణ ప్రజలకు మళ్లోసారి చూపించారు.  తినేది మొగని తిండి పాడేది మిండల పాట.......పాడండి. పాడండి. ఎన్ని రోజులు పాడుతరు......మా అయితే మరో వారమ్ పది రోజులు. అంతేకదా.

ఈలోపు రాష్ట్రమ్ లో మరింత విద్వంసమ్ జరగకుండా ఉండాలి అంటే కేంద్రమ్ వెంటనే ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విదించాలి. దేశ పార్లమెంట్ నిర్ణయాన్నే ధిక్కరిస్తూ ఉద్యమమ్ పేరుతో విద్వంసమ్ చేస్తున్న విద్రోహ శక్తులను దేశద్రోహులుగా పరిగనించి పీచమణచాలి. ముఖ్యమంత్రి, డీజీపి అండ చూసుకొని చిల్లర లొల్లి చేస్తున్న సీమాంద్ర దొంగ ఉద్యోగులు సమ్మే చేస్తే ఎస్మా ప్రయోగించాలి. విలైనంత తొందరగా తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాస్ చేయాలి.

Thursday 8 August 2013

ఊపు లేని ఉద్యమమ్........


ఎహే.... ఏంటహే ఈ సప్పటి తిండి. ఎన్ని రోజులు ఇలా ఓ ఊపు జోషు లేకుండా సమైక్య ఉద్యమమ్ నడుపుతరు. కాస్త కాక పెంచండహె.

ఇప్పటికి లొల్లి షురుజేసి వారమ్ పది రోజులు దాటి పోతుంది. చూసిన విజువల్సే చూసీ చూసి బోర్ కొడుతుంది.  ఇంత వరకూ ఒక లాఠీచార్జి లేదు, టియర్ గ్యాసు లేదు. ఒక్క బుల్లెట్ పేలలేదు. ఒక్కనికి మక్కెలిర్గలేదు. గిట్ట్లయితే లాభమ్ లేదు తమ్మి.  మీ లొల్లిని ఎవ్వడు పట్టిచ్చుకోడు..... కమాన్ కమాన్...  బాయ్స్ షేకిట్ అప్. కొంచెమ్ స్పీడు పెంచాలి.

గట్లనే ఇప్పుడున్న కళాకారులకు తోడుగా మీ స్టార్ బ్యాట్స్ మెన్ ను బయటకు తేవాలి. మాజీ మంత్రి మారెప్ప నోరిప్పాలి. అయిందానికి కానిదానికి అంగి చింపుకునే బంగి అనంతయ్య ఉద్యమమ్‌లో పుంగి భజాయించాలి.  గజల్ శ్రీనివాస్ గజ్జెగట్టి పాడాలి, డక్కి గొట్టుకుంట డ్యాన్స్ చేయాలి.  తెలుగు తమ్ముడు చిత్తూర్ ఎంపీ శివప్రసాద్ మళ్ళీ పోతరాజు వేషమ్ గట్టాలి.

ఇందుకు సీమాంధ్ర యువకులంతా చొరవ తీసుకోవాలి.  ఇలాంటి  సాటిలేని మేటి నాయకులను బరిలోకి దింపి పార్టీలకు అతీతమ్‌గా ఒక జేయేసీ పెట్టుకొని సమైక్య ఉద్యమ సెగను డిల్లీకి తాకించాలని మనవి.









ఇప్పటికే సందుజూసి చిందులేసె కే"వీపీ", బీపీ పెంచుకున్న పీపీ (Parakala Prabhakar) లు ఉద్యమమ్ లో దూరిపోయారు కాబట్టి కాస్త వినోదమ్ గా ఉంది.

కానీ ఏదో వెలితిగా ఉందబ్బ..... ఏదో మిస్సింగ్.... ఏంటడి...ఏంటది?

ఆ.... యాదికొచ్చింది. రికార్డింగ్ డ్యాన్స్. పోయిన సారి సమైక్యాంద్ర ఉద్యమమ్లో లా ఈసారీ ఐటమ్ సాంగులకు రికార్డింగ్ డ్యాన్స్ లు చేపిస్తే చూపరులకు ఆటవిడుపుగా ఉంటుంది.

ఇంకేంది షురు జెయ్యిండ్రి. 

Wednesday 7 August 2013

సీమాంధ్రలో సమైక్య ఉద్యమమే లేదు:దళిత ఉద్యోగులు

సీమాంధ్రలో సమైక్య ఉద్యమమే లేదు:దళిత ఉద్యోగులు

హైదరాబాద్ : సీమాంధ్రలో సమైక్య ఉద్యమమే లేదు అని ఆంధ్రా ప్రాంతానికి చెందిన దళిత, బహుజన ఉద్యోగులు స్పష్టం చేశారు. కొంత మంది పెట్టుబడుదారులు, అగ్రకులాల వారు మాత్రమే కృత్రిమ ఉద్యమాన్ని నడుపుతున్నారని తెలిపారు. ఏపీ ఎన్జీవోల, సీమాంధ్ర బడాబాబుల నాటకాలు బట్టబయలు చేస్తామని తేల్చిచెప్పారు. వ్యాపార ప్రయోజనాల కోసమే సీమాంధ్ర నేతలు రాజీనామాలు చేస్తున్నారని చెప్పారు. ఈ నెల 10న ఒంగోలు బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏపీఎన్జీవోల నాటకాలు బయటపెడుతామని స్పష్టం చేశారు. ఏపీ ఎన్జీవోలు ఇప్పటికైనా కపట నాటకాలు కట్టిపెట్టి రాష్ట్ర విభజనకు సహకరించాలని కోరారు. రాష్ట్ర విభజన కోరుతూ దళితులు, బహుజనులు ర్యాలీలు, నిరసనలు చేపట్టినా మీడియా చూపటం లేదు అని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన కోసం ఆందోళనలకు దిగుతామని స్పష్టం చేశారు. ఏపీ ఎన్జీవోల సమ్మెలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు పాల్గొనరు అని తేల్చిచెప్పారు. సమ్మెకు సహకరించకుండా యథావిధిగా విధులకు హాజరు కావాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయం చిన్న రాష్ట్రాల ఏర్పాటు.. అదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. 

(Courtesy: Namasthe Telangaana)

రాజధానిని పంచుకోవడమ్ అంటే భ్యార్యను పంచుకున్నట్లు ఉంటుంది --రాజాజి.


రాజధానిని పంచుకోవడమ్ అంటే భ్యార్యను పంచుకున్నట్లు ఉంటుంది  --రాజాజి.
అందులో తప్పేముంది. పాండవులు ఒక్కర్తెనే పంచుకో లేదా?  -- వరదరాజులు నాయుడు.

ఈ సంవాదమ్ ఎక్కడో సందుగొందుల్లో జరిగింది కాదు. ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీలోని చర్చ.  మద్రాసు ఉమ్మడి రాజధానిగా ఒప్పుకునేది లేదని, అలాంటి ప్రతిపాదనే తప్పని, అది భార్యను పంచుకున్నట్లుగా ఉంటుందని రాజాజి గారంటే, అందులో తప్పేంటని పాండవులు ఒక్కర్తెనే పంచుకోలేదా అవసరాన్ని బట్టి సర్దుకు పోవాలి అని నాయుడు గారు సెలవిచ్చారు. ఈయన ఎవరో అల్లాటప్పా మనిషి అనుకునేరు. ఈయన పేరుమోసిన స్వాతంత్ర సమరయోధుడు. అప్పటి ఆంధ్రా కాంగ్రెస్ లో పేద్ద నేత. The Indian Express పత్రిక పెట్టి నెత్తిమీద తెల్లగుడ్డ కప్పుకున్న వ్యక్తి.

(ఆంధ్రపత్రిక: 13/03/1953, Page-5 )


 
(ఆంధ్రపత్రిక: 13/03/1953, Page-3 )


ఇది అప్పటి ఆంధ్రా నాయకుల సంస్కారమ్. అప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్లలో పెద్దగా మార్పు రాలేదు. ఇక ముందు వస్తదని ఆశలేదు.

కానీ ఇప్పుడు తెలంగాణ విషయమ్ లో అలా చెప్పడమ్ లేదు. మీకో దిక్కు దొర్కెదాక ఒక తల్లి పిల్లల్లెక్క హైదరాబాదు ను చూసుకుందామ్ అన్నా ఎవ్వనికీ దిమాగ్ పనిచేస్తలేదు. 

అన్నదమ్ముల్లా విడిపోదామ్ ఆత్మీయుల్లా కలుసుందామ్ అన్నది కూడా అప్పటి ఆంధ్రా నాయకుల నినాదమే.

అప్పటి నాయకుల ఇప్పటి నాయకుల మాటల్లోని సారుప్యాలు.

ఇప్పటి తెలంగాణ నాయకులు:  తెలంగాణ రాష్టమ్..... ఆంధ్ర సోదరుల అడ్డంకులు.
అప్పటి ఆంధ్ర రాష్ట్ర నాయకులు:  ఆంధ్ర రాష్ట్రమ్.... అరవ సోదరుల అడ్డంకులు.

(ఆంధ్రపత్రిక: 13/03/1953, Page-3 )


ఇప్పుడు:  హైదరాబాదు మాతోనే డెవలప్ అయింది.
అప్పుడు:  మద్రాస్ ఆంధ్రుల వల్లనే అభివృద్ది అయింది.

 (ఆంధ్రపత్రిక: 13/03/1953, Page-5 )


 (ఆంధ్రపత్రిక: 13/03/1953, Page-5 )


ఇప్పుడు:  తెలుగు భాష మాట్లాడుతున్న మనమ్ అంతా ఒకే జాతి అందుకే కలిసి ఉండాలి
అప్పుడు:  వివిధ భాషలు మాట్లాడుతున్నా మన మంతా ఒకే జాతి ఒకే వర్గమ్ లా భావించుకోవాలి.

  (ఆంధ్రపత్రిక: 13/03/1953, Page-5 ) 

ఇప్పటి తెలంగాణ నాయకులు: అధిష్టానమ్ నిర్ణయానికి అంతా కట్టుబడాలి. అన్నదమ్ముల్లా విడిపోయి రెండు రాష్ట్రాలను అభివృద్ది చేసుకుందామ్.
అప్పటి ఆంధ్రా నాయకులు: కేంద్రమ్ ఇచ్చే నిర్ణయమ్ అంతా శిరసావహించాలి. సోదరులుగా విడిపోయి ప్రశాంతంగా కాలమ్ గడపాలి.


  (ఆంధ్రపత్రిక: 13/03/1953, Page-5 )

అంతేకాదు అరవలు ప్రాణాలు పోయినా పరవాలేదు కానీ ఆంధ్రోల్లను మాత్రమ్ మద్రాస్ లో ఉండనీయమ్ అని తెగేసి చెప్పారు. సింపుల్ గా చెప్పాలి అంటే మెడలు పట్టి గెంటారు. ఇప్పుడు చరిత్ర మళ్లీ రిపీట్ కాబోతుంది.


  (ఆంధ్రపత్రిక: 13/03/1953, Page-5 ) 

రేపు రేపు రాయలసీమ జనాలకు కూడా ఆంధ్రోళ్లతోని నెత్తి నొప్పులు తప్పయి. వీళ్లను వంగోబెట్టడానికి అరవ సోదరులే బెస్ట్. వీళ్ళని తీసుకెళ్లి మళ్లీ తమిళోల్లకు అప్పజెబితేనే వీళ్ల రోగమ్ కుదురుతుంది.

అనాటి ఆంధ్రపత్రిక చదివితే రాజాజీ రాజకీయాలకు ఆంధ్రా నాయకులు ఎంత ఉ.. పోసుకున్నారో తెలుస్తుంది, ఆయన డిల్లీకి వెళితే వీళ్లకు ఇక్కడ చెమటలు పట్టేవి  ఏమ్ రాజకీయమ్ చేస్తున్నాడో అక్కడ అని. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రమ్ లో వీళ్ల బిచ్చపు బతుకులు ఎలా ఉండేవో, ఎసొంటి లత్కూర్ ఏషాలు ఏషిండ్రో ఎరుకగావాలంటే ఈ పేపర్ చదువుండ్రి.  ఈ పేపరులో వీళ్ళ లలితకళలు చాలానే తెలుస్తాయి.


PLEASE download full paper from here.    http://www.divshare.com/download/24356241-042

Tuesday 6 August 2013

మన బాద్‌షా బ్రహ్మీ.........

ఈ మధ్య వచ్చిన బాద్‌షా సినిమా చూసిన వాళ్లకు అందులో బ్రహ్మానందమ్ కామెడీ గుర్తుండే ఉంటుంది. చిన్న రామారావు తన పథకమ్ కోసమ్ ఓ బకరాని వెతుకుతుంటే అన్ని లక్షణాలు సరిపోయేట్టు బ్రహ్మీ తగులుతాడు. బ్రహ్మీని నువ్వు డ్రీమ్ లోని వెళ్లిపోతున్నావు నీ డ్రీమ్ లో నువ్వే కింగు నీకు ఎదురు లేదు అని ఓ కుర్చీ మీద కూర్చోబెట్ట్లి రెచ్చగొట్టి తెరచాటున పనులు చక్కబెడతాడు.




ఇప్పుడు మన రాష్టమ్‌లో అధిష్టానమ్ కిరణ్ గారితో అచ్చమ్‌గా ఇలాంటి ఆటనే ఆడించింది. ఏపీలో తమ కథ నడిపించడానికి అచ్చమైన బకరాని వెతుకుతుంటె కిరణ్ గారు అన్ని విధాలా యోగ్యుడిలా కనిపించాడు. రాష్ట్రమ్ మీద పట్టులేదు, ప్రభుత్య పనితీరుపై అవగాహన లేదు. అంతెందుకు గతమ్ లో మంత్రిగా పనిచేసిన అనుభవమ్ కూడా లేదు.  ఇలాంటి వాడైతే పర్ఫెక్ట్‌గా పనికొస్తాడని పిలిచి నీకు ఎదురు లేదని నువ్వే కింగువని చెప్పి సీఎమ్ కూర్చిలో కూర్చోబెట్టి కలల లోకమ్‌లోకి పంపింది.



అంతే కిరణ్ గారు రెచ్చిపోయారు. రాగానే  బొత్సాను మద్యమ్ కుంభకోణమ్ లో ఇరికించాడు, శంకర్ రావును అరెస్ట్ చేయించాడు, డీఎల్ రవీందర్ బర్తరఫ్ చేసాడు, తను మొండి వాన్ని అని తనకుతానే సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు, భూకంపమ్ సృష్టించు చుద్దామ్ అని తెలంగాణ నాయకులకు సవాల్ విసిరాడు. అంతటితో ఆగక అసెంబ్లీ సాక్షిగా "రాసిపెట్టుకో తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనూ ఏమ్ చేస్తావో చేసుకో అని" అని విర్రవీగాడు. ఒక కలల ప్రపంచమ్‌లో విహరించాడు.

కానీ ఇప్పుడో......అయిపోయింది. అంతా అయిపోయింది. ఇప్పటి వరకు జరిగింది అంతా కల కాదని తెలిసిపోయింది.  హీరో ఎవరో కమేడియ ఎవరో ఫుల్ క్లారిటీ వచ్చింది. బకరా ఎవరో బాద్‌షా ఎవరో బాగానె అర్థమ్ అయింది. పులిలా ఊహించుకున్న తనను అధిష్టానమ్ అసలు పిల్లిలా కూడా చూడడమ్ లేదని తెలిసిపోయింది.

పాపమ్....... "లే లే లే నా రాజా" అని సమైక్య ఉద్యమాన్నిఎంత లేపాలని చూసినా లేవడమ్ లేదే?

Monday 5 August 2013

హైదరాబాద్ లో విశాలాంధ్ర వారి భారీ సభ !!!!

పరకాల ప్రభాకర్.... గీ పేరు యాదికుందా?

ఏందీ గప్పుడే యాదిమర్చి పోయిండ్రా?

గదే గిప్పుడు తద్దినమ్ పెట్టుకున్న ప్రజారాజ్యమ్ పార్టీకీ ఒకప్పుడు ఫ్రంట్ పేసు, "సామాజిక బేరమ్" గిట్టుబాటు గాగ బయటకు వచ్చి ఎవరూ దగ్గరికి రానివ్వక పోతే తానే ఒక సొంత కుంపటి పెట్టుకుని ఊళ పుట్టినప్పుడల్లా జై సమైక్యాంధ్ర అంటాడు, అప్పుడప్పుడు వార్డు మెమ్బరు ఎమ్మెల్సీ లకు పోటీ చేస్తుంటాడు, అమాస పున్నానికి పది మంది పనోల్లను వెంటేసుకొని జై విశాలాంధ్ర అంటడు, "లైక్ మైండెడ్" జనాలతో డిల్లీ స్థాయిలో సభలు నిర్వహిస్తుంటాడు, ఫొటోలు తీసుకొని వెబ్ సైట్లో, విడియోలు తీసుకొని యూటూబ్లో పెట్టి తెలుగు జాతిని ఓ వెలుగు వెలిగిస్తుంటాడు, ప్రణవ స్కూల్లో తెలుగు భాష గొప్పతన్నాన్ని ఇంగ్లీష్లో చెప్తుంటాడు.........

యాదికొచ్చిందా...??

ఆ....ఆయనే పరకాల ప్రభాకర్ గారు, సింపుల్ గా PP.

ఈ పీపీకి సారీ పీపీ గారికి (ఎంత పీపీ అయితే మాత్రమ్ సంభోధనలో గౌరవమ్ తగ్గొద్దుకదా) మొన్న తెలంగాణ ప్రకటన రాగానే సహజంగానే హైదరాబాదులో బ్రహ్మాండమైన విశాలాంద్ర సభ పెట్టి తన సత్తా చాటలనిపించింది. వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్లి, నేను పీపీని ఏపీని ఏకంగా ఉంచడానికి సభ పెడతాను అనుమతి ఇవ్వండి అంటే వాళ్లు చేయి ఖాళీ లేదు, మళ్లీ రమ్మన్ని చెప్పారు. ఏంటీ నాకే అనుమతి ఇవ్వరా, నా హక్కులనే కాలరాస్తారా, నేనంటే ఏమనుకుంటున్నారు నేనెవరుకుంటున్నారు.... పీపీని అని బీపీ పెంచుకొని హెచ్చార్సీ వద్దకెళ్లాడు. ఆయనేమో హక్కులేదు తొక్కలేదు ఏది హెచ్చార్సీ కిందికి వస్తుందో ఏది రాదు తెలుసుకోకుండా మాదగ్గరికి వచ్చి మా టైమ్ ఎందుకు ఖరాబ్ చేస్తరని తిట్టి పంపారు.

అయినా పంతమ్ నెగ్గాల్సిందేనని లేకపోతే ఇజ్జత్ పోతదని నిన్న ఆదివారమ్ ఒక బ్రహ్మాండమైన్ సభ పెట్టి అశేషజనవాహినితో విజయవంతమ్ చేసాడు.

ఇంత కష్టపడ్డా ఆయనకు తగినంత మైలేజీ వస్తుందో రాదో అని ఈ బ్లాగు ద్వారా కాస్త ప్రచారమ్ కలిపిస్తున్నాము.





ఈ పీపీ గారు ఇలాంటి సభలు మరెన్నో పెట్టాలి అని పీపీ అభిమానుల జేయేసీ తరుపున డిమాండ్ చేస్తున్నాము. 

Sunday 4 August 2013

సమైక్య సన్నాసుల తమాషా చూడరబాబు :)

ఇదీ సమైక్య ముసుగులో తమాషా చేస్తున్న మన చిల్లరగాల్ల ప్రతాపమ్. ఈ రాష్టానికి చెందని వాళ్ల దగ్గర, ఈ గొడవలతో సంబంధం లేని వాళ్ల దగ్గర వీళ్లు చూపించే ప్రతాపమ్ వీక్షించండి.

షూటింగ్ కోసమ్ వచ్చిన నటులను పట్టుకొని జై సమైక్యాంధ్ర అను, జై ఇది అను, జై అది అని వేదించడమ్. గాంధేయమార్గమ్ లో నడుస్తున్న ఈ సన్నాసులు చేసిన విన్నపమ్ వినక పోతే జై సమైక్యాంధ్ర అనకపోతే ఈమె సినమాలు ఆడనివ్వరట, గాంధేయమార్గమ్‌లో శాంతియుతంగా ఈమె సినిమా రీళ్లు తగలబెడతారట...

హుమ్..ఆంధ్రా సంసృతి.


Saturday 3 August 2013

ఆంధ్రా కాపిటల్: డేరా నగర్.......


కేంద్రప్రభుత్వమ్ తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు చాలా స్పష్టమైన ప్రకటన చేసినా మన సీమాంధ్ర నాయకులు ఇంకా సమైక్యాధ్ర పేరుమీద ప్రజలను మభ్యపెడ్డడమ్ మానలేదు. ఇప్పుడు కూడా ఇంకా తెలంగాణను అడ్డుకుంటామ్, రాష్త్రాన్ని ముక్కలు కానీయమ్ అని బీరాలు పోతున్నరు. వీళ్లు ఇంకా కళ్లు తెరుచుకోకుండా జరుగుతున్నది అర్థమ్ చేసుకోకుండ స్వంతప్రయోజనాలతో రాజకీయాలు చేస్తే సీమాంధ్రకు మిగిలేది చిప్పే.

రాయలసీమ వాళ్లు ఇప్పటికే లబలబలడుతున్నారు ఆంధ్రనాయకుల మాటలు విని సంకనాకిపోయాము అని. ఇప్పుడైన సోయి తెచ్చుకొని వాళ్ళ అభివృద్దికి ఏమ్ కావాలో కేంద్రానికి విన్నవించుకోక పోతే జరిగే నష్టానికి వాళ్లే భాద్యులవుతారు. పైకి రాష్ట్రాన్ని సమైక్యా ఉంచడానికి ఇంకా ప్రయత్నిస్తున్నమ్ అని చెప్తున్న ఆంధ్రా నాయకులంతా అధిష్టానమ్ పెద్దల దగ్గర కొత్తరాష్ట రాజధానిని విజయవాడలో ఏర్పాటు చేయాలి అని లాబీయింగు మొదలు పెట్టారు. రాయలసీమ నాయకులు రాజధాని కోసం ప్రయత్నించపోతే ఆ ప్రాంత ప్రజలు క్షమించరు.

ఆంధ్ర రాష్రమ్ ఏర్పడ్డప్పుడు ఇలాగే మద్రాసు మాకే కావాలి అని మంకు పట్టు పట్టి రాజాజి తంతే కర్నూలు వచ్చి పడ్డారు. అప్పటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని వైభవాన్ని వివరించడానికి ఈ బ్లాగు చాలదు. కానీ కొన్ని మధుర జ్ఞాపకాలు మీకోసమ్.










అప్పటి రాజధానిని ముద్దుగా "టెంట్ కాపిటల్", "గుఢారల గూడెమ్", "డేరా నగర్" అని పిలుచుకునేవారట :)

అప్పటి జ్ఞాపకాలను తలుచుకోని సీమాంధ్రులు బెంగపడొద్దని మనవి. ఎందుకంటే ఇప్పుడు మనమ్ చాల అభివృద్ధి చెందామ్. గుఢారాలకు కాలమ్ చెల్లిపోయింది. కిరణ్ సారు మీకు ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ బిల్డింగ్ లాంటివి కట్టి గుఢారాలల్లో సంసారానికి దూరమ్ గా చేస్తడని మా ఫ్రగాడ విశ్వాసమ్.

కాదూ కూడదు ఇందిరమ్మ ఇల్లు మాకొద్దు, గుఢారాల్లోనే ఉంటామ్, గుడిసెల్లో ఆఫీసులు నడిపిస్తామ్ అంటారా, సరే అలాగే కానివ్వండి.

సీమాంధ్ర జనాలకో ఉచిత సలహా, ఇప్పటికైనా మీకేమ్ కావాలో కేంద్రాన్ని అడగకుండా ఇలాగే మీ కొంపలు కాల్చుకోని కొట్టుకుంటుంటే మట్టిగొట్టుకు పోతరు.

పొమ్మంటె పోవెందుకు పోర ఓ ఆంద్రదొర