Wednesday, 14 August 2013

దీనికి ట్రాన్స్‌లేషన్‌ అక్కర్లేదు సార్....కావలసింది ఎక్స్‌ప్రెషన్!!!!!!

నిన్న మన నాయకులు జంతర్ మంతర్ దగ్గర కామెడీ చేయడానికి రెడీ అయితే ఆ మాత్రమ్ కామెడీకి అక్కడి దాకా ఎందుకు ఇక్కడే పార్లమెంట్ ఆవరనలోనే చేసుకోండని అధిష్టానమ్ తగురీతిలో చెప్పడమ్ తో అక్కడే గజ్జెగట్టి ఇజ్జత్ కాపాడుకున్నరు. 

అయితే డిల్లీలో ఉండే హిందీ వాళ్ళకు వీళ్ల తెలుగు చప్పుల్లు వినబడతాయ అని ఎవరు అనుమానపడొద్దు.  మొన్న  హరికృష్ణ గారు సెలవిచ్చినట్లు, ట్రాన్స్‌లేషన్ తో పని లేదు ఎక్స్‌ప్రెషన్ ఉంటే చాలని  కెమరాల ముందు దుమ్ము రేగే ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు.  ఫోటోలకు పోజులిచ్చి, విడియోలకు కావలసిన విజువల్స్ ఇచ్చి తంతు ముగించారు.

ఇందులో  మన మెగస్టార్ గారిది మాత్రమ్ వెరైటీ  వ్యవహారమ్.  "తటస్తుడిగా" ఉండాలని ఎంత ప్రయతించినా ప్రజలు తన్నేట్లు ఉన్నారని మందలో కలవకుండా ఉండలేని పరిస్థితి.  అంటీ ముట్టనట్లు వ్యవహరించి నటనలో మెచ్యూరిటీ చూపకపోయినా తతిమా నాయకులు మాత్రమ్ నటనలో జీవించారు.




పొద్దంతా టీవీల్లో చూసారు కదా...... మరెందుకు ఆలస్యమ్. వీళ్ల ఫర్పార్మెన్స్ మీకు నచ్చీతే "ఆంధ్ర  420" అని టైప్ చేసి మీ ఇష్టమ్ వచ్చిన నంబర్‌కు SMS చేసుకోండి.

No comments:

Post a Comment