Wednesday 7 August 2013

రాజధానిని పంచుకోవడమ్ అంటే భ్యార్యను పంచుకున్నట్లు ఉంటుంది --రాజాజి.


రాజధానిని పంచుకోవడమ్ అంటే భ్యార్యను పంచుకున్నట్లు ఉంటుంది  --రాజాజి.
అందులో తప్పేముంది. పాండవులు ఒక్కర్తెనే పంచుకో లేదా?  -- వరదరాజులు నాయుడు.

ఈ సంవాదమ్ ఎక్కడో సందుగొందుల్లో జరిగింది కాదు. ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీలోని చర్చ.  మద్రాసు ఉమ్మడి రాజధానిగా ఒప్పుకునేది లేదని, అలాంటి ప్రతిపాదనే తప్పని, అది భార్యను పంచుకున్నట్లుగా ఉంటుందని రాజాజి గారంటే, అందులో తప్పేంటని పాండవులు ఒక్కర్తెనే పంచుకోలేదా అవసరాన్ని బట్టి సర్దుకు పోవాలి అని నాయుడు గారు సెలవిచ్చారు. ఈయన ఎవరో అల్లాటప్పా మనిషి అనుకునేరు. ఈయన పేరుమోసిన స్వాతంత్ర సమరయోధుడు. అప్పటి ఆంధ్రా కాంగ్రెస్ లో పేద్ద నేత. The Indian Express పత్రిక పెట్టి నెత్తిమీద తెల్లగుడ్డ కప్పుకున్న వ్యక్తి.

(ఆంధ్రపత్రిక: 13/03/1953, Page-5 )


 
(ఆంధ్రపత్రిక: 13/03/1953, Page-3 )


ఇది అప్పటి ఆంధ్రా నాయకుల సంస్కారమ్. అప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్లలో పెద్దగా మార్పు రాలేదు. ఇక ముందు వస్తదని ఆశలేదు.

కానీ ఇప్పుడు తెలంగాణ విషయమ్ లో అలా చెప్పడమ్ లేదు. మీకో దిక్కు దొర్కెదాక ఒక తల్లి పిల్లల్లెక్క హైదరాబాదు ను చూసుకుందామ్ అన్నా ఎవ్వనికీ దిమాగ్ పనిచేస్తలేదు. 

అన్నదమ్ముల్లా విడిపోదామ్ ఆత్మీయుల్లా కలుసుందామ్ అన్నది కూడా అప్పటి ఆంధ్రా నాయకుల నినాదమే.

అప్పటి నాయకుల ఇప్పటి నాయకుల మాటల్లోని సారుప్యాలు.

ఇప్పటి తెలంగాణ నాయకులు:  తెలంగాణ రాష్టమ్..... ఆంధ్ర సోదరుల అడ్డంకులు.
అప్పటి ఆంధ్ర రాష్ట్ర నాయకులు:  ఆంధ్ర రాష్ట్రమ్.... అరవ సోదరుల అడ్డంకులు.

(ఆంధ్రపత్రిక: 13/03/1953, Page-3 )


ఇప్పుడు:  హైదరాబాదు మాతోనే డెవలప్ అయింది.
అప్పుడు:  మద్రాస్ ఆంధ్రుల వల్లనే అభివృద్ది అయింది.

 (ఆంధ్రపత్రిక: 13/03/1953, Page-5 )


 (ఆంధ్రపత్రిక: 13/03/1953, Page-5 )


ఇప్పుడు:  తెలుగు భాష మాట్లాడుతున్న మనమ్ అంతా ఒకే జాతి అందుకే కలిసి ఉండాలి
అప్పుడు:  వివిధ భాషలు మాట్లాడుతున్నా మన మంతా ఒకే జాతి ఒకే వర్గమ్ లా భావించుకోవాలి.

  (ఆంధ్రపత్రిక: 13/03/1953, Page-5 ) 

ఇప్పటి తెలంగాణ నాయకులు: అధిష్టానమ్ నిర్ణయానికి అంతా కట్టుబడాలి. అన్నదమ్ముల్లా విడిపోయి రెండు రాష్ట్రాలను అభివృద్ది చేసుకుందామ్.
అప్పటి ఆంధ్రా నాయకులు: కేంద్రమ్ ఇచ్చే నిర్ణయమ్ అంతా శిరసావహించాలి. సోదరులుగా విడిపోయి ప్రశాంతంగా కాలమ్ గడపాలి.


  (ఆంధ్రపత్రిక: 13/03/1953, Page-5 )

అంతేకాదు అరవలు ప్రాణాలు పోయినా పరవాలేదు కానీ ఆంధ్రోల్లను మాత్రమ్ మద్రాస్ లో ఉండనీయమ్ అని తెగేసి చెప్పారు. సింపుల్ గా చెప్పాలి అంటే మెడలు పట్టి గెంటారు. ఇప్పుడు చరిత్ర మళ్లీ రిపీట్ కాబోతుంది.


  (ఆంధ్రపత్రిక: 13/03/1953, Page-5 ) 

రేపు రేపు రాయలసీమ జనాలకు కూడా ఆంధ్రోళ్లతోని నెత్తి నొప్పులు తప్పయి. వీళ్లను వంగోబెట్టడానికి అరవ సోదరులే బెస్ట్. వీళ్ళని తీసుకెళ్లి మళ్లీ తమిళోల్లకు అప్పజెబితేనే వీళ్ల రోగమ్ కుదురుతుంది.

అనాటి ఆంధ్రపత్రిక చదివితే రాజాజీ రాజకీయాలకు ఆంధ్రా నాయకులు ఎంత ఉ.. పోసుకున్నారో తెలుస్తుంది, ఆయన డిల్లీకి వెళితే వీళ్లకు ఇక్కడ చెమటలు పట్టేవి  ఏమ్ రాజకీయమ్ చేస్తున్నాడో అక్కడ అని. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రమ్ లో వీళ్ల బిచ్చపు బతుకులు ఎలా ఉండేవో, ఎసొంటి లత్కూర్ ఏషాలు ఏషిండ్రో ఎరుకగావాలంటే ఈ పేపర్ చదువుండ్రి.  ఈ పేపరులో వీళ్ళ లలితకళలు చాలానే తెలుస్తాయి.


PLEASE download full paper from here.    http://www.divshare.com/download/24356241-042

7 comments:

  1. Anonymous8/07/2013

    akkada madras TN prantam lo undi. akkada anyayam jarigindani vadili(tyagam) vachesam. ikkada Hyd telangana prantam lo undi. mammalni tarimi antaa anubhavinchaalane atyaasa meedi. capital kurnool lo unte leka chandigarh laanti paristiti unte mee naatakaalu saagevaa? 1956 lo rendo mogunni kattukunnaaka(mee assembly lo teermaanam chesi)vaadu oorukuntaadaa?

    ReplyDelete
    Replies
    1. త్యాగం చేయమని ఎవరు అడిగిన్రు, హాయిగా శామియానాలో ఉండక?

      Delete
    2. Anonymous8/07/2013

      masthu chippinavu anna

      Delete
  2. Anonymous8/07/2013

    brother, don't spread hatred in India by these local feeling, India is still poor country due this kind of rationalism towards to a places. I hope you understand this comparing to China or USA.

    ReplyDelete
    Replies
    1. Anon: If there is no local feeling, why are people speaking about Andhra? Let those who preach practice first. Let them speak about India instead of Andhra, Telugus etc.

      Delete
  3. మద్రాస్ నుంచి కొద్దిమంది రాజకీయ ఉద్యోగ వ్యాపార వర్గాలే వచ్చాయి
    తప్ప మొత్తం ఆంధ్తులంతా ఏమీ రాలేదు
    ఇప్పటికీ అక్కడ 50-60 లక్షల మంది ఆంధ్రులు హాయిగా వున్నారు.
    హైదరాబాద్ నుంచి కూడా అందరూ వెళ్ళిపోవాల్సిన పని లెదు.
    మద్రాస్ లో వున్నట్టు ఇక్కడా వుండి పొవచ్చు.
    నిజానికి త్యాగం అనే పదం మీకు వర్తించదు.
    మీరు కర్నూలును వదిలించుకున్నారు తప్ప త్యాగం చెయలెదు.
    అప్పటికే అన్ని హంగులు వున్న హైదరాబాద్ మీద కన్నేసి దురాశ తో
    వచ్చారు.
    మీరు తెలంగాణాను అన్ని విధాలా కొల్లగొట్టి మేమేదో ఉద్ధరిమ్చాం అని కాలర్ ఎగరేసుకోడం మీకే చెల్లింది
    ఇప్పుడు తెలంగాణా ప్రజలకు మీ అసలు రూపం తెలిసింది
    ఇంక ఇక్కడ మీ ఆటలు ఎంతోకాలం సాగవు
    ఇప్పటికైనా బడాయి మాటలు, అసత్యప్రచారాలు, ఆత్మవంచన మాని మీకంటూ మీరు సొంతంగా ఒక అందమైన రాజధానిని డెవెలప్ చేసుకుని ఆత్మగౌరవంతో బతికండి
    తెలంగాణాను తన మానాన తనని బతకనివ్వండి !

    ReplyDelete
  4. ఆంద్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మద్రాస్ నుంచి
    కొద్దిమంది రాజకీయ, ఉద్యోగ, వ్యాపార వర్గాలే
    తప్ప మొత్తం ఆంధ్రులంతా ఏమీ రాలేదు
    ఇప్పటికీ అక్కడ 50-60 లక్షల మంది ఆంధ్రులు హాయిగా వున్నారు.

    అలాగే హైదరాబాద్ నుంచి కూడా ఆంధ్రులంతా ఏమీ వెళ్ళిపోవాల్సిన పని లేదు.
    మద్రాస్ లో వున్నట్టు ఇక్కడా వుండి పొవచ్చు.

    నిజానికి త్యాగం అనే పదం మీకు వర్తించదు.
    మీరు కర్నూలును వదిలించుకున్నారు తప్ప త్యాగం చెయలేదు.
    అప్పటికే అన్ని హంగులు వున్న హైదరాబాద్ మీద కన్నేసి దురాశ తో వచ్చారు.

    మీరు తెలంగాణాను అన్ని విధాలా కొల్లగొట్టింది కాక
    మేమేదో ఉద్ధరిమ్చాం అనడం మీకే చెల్లింది
    ఇప్పుడు తెలంగాణా ప్రజలకు తమకు నిధులు నీళ్ళు ఉద్యోగాల విషయంలో
    జరుగుతున్న ఘోరమైన అన్యాయాలన్ని అర్ధమయ్యాయి.

    ఇంకా ఇక్కడ మీ ఆటలు ఎంతోకాలం సాగవు...
    దొంగమాటలు ఇకనైనా చాలించి, బడాయి మాటలు, అసత్యప్రచారాలు, ఆత్మవంచన మాని
    మీకంటూ మీరు ఒక అందమైన రాజధానిని డెవెలప్ చేసుకుని
    ఆత్మగౌరవంతో బతికండి
    తెలంగాణాను తన మానాన తనని బతకనివ్వండి !

    ReplyDelete