Friday, 16 August 2013

ఎవడి ఆక్టింగులు వాడు చేస్తున్నాడు. ఎవడి ఆంగిల్ వాడిది.........

ఈ సమైక్యాంధ్ర ఉద్యమేమో కాని రోజు పొద్దున్నుండి రాత్రి దాక వీళ్ల కామెడీ చూడడమ్ కష్టంగా ఉంది. ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమమ్ చూసిన కొంత మంది ఉద్యమమ్ అంటే ఇలా చేయాలి అని నేర్చుకొని కొంత వరకు కాపీ బాగానే కొట్టారు. కానీ కాపీ కొట్టడానికి కూడా తెలివుండాలి. లేక పోతే నవ్వుల పాలైతారు. హకల్ సే నకల్ మారొ అని అందుకే చెప్పారు.

అన్ని కాపీ కొట్టడమ్ ఐపోయింతర్వాత ఇప్పుడు ఏమ్ చేయాలో దిక్కుతోచడమ్ లేదు. ఎప్పుడు వెంటపడి తిరుగుతున్న కెమరా వాళ్లు ఏదో ఒకటి చేయకపోతే వదిలేట్లు లేరు. అందుకని ఏ పని చేసినా దానే సమైక్యాంధ్ర కోసమ్ నిరసన అనుకుంటే సరి అని కొత్త కామెడీ షురు జేసిండ్రు. ఈ కామెడీల్లో నుండి మచ్చుకు కొన్ని:

సమైక్యాంధ్ర కోసమ్ నిద్ర లేవడమ్
సమిక్యాంధ్ర కోసమ్ చెరువు గట్టుకు వెళ్లడమ్
సమైక్యాంధ్ర కోసమ్ స్నానాలు చేయడమ్
సమైక్యాంధ్ర కోసమ్ అన్నమ్ తినడమ్
సమైక్యాంధ్ర కొసమ్ డైటింగ్ చేయడమ్
సమైక్యాంధ్ర కోసమ్ సైకిల్ తొక్కడమ్
సమైక్యాంధ్ర కోసమ్ యోగా
సమైక్యాంధ్ర కోసమ్ ముగ్గులు
సమైక్యాంధ్ర కోసమ్ పెగ్గులు
సమైక్యాంధ్ర కోసమ్ మంత్రుల ఝండా వందనమ్
సమైక్యాంధ్ర కోసమ్ రాజీనామాలు
సమక్యాంధ్ర కొసమ్ ప్రజలకు పంగనామాలు

"నాతో మాట్లాడడమే నీకు ఎడ్యుకేషన్" అన్నట్లు మేమ్ ఏమ్ చేసినా అది సమైక్యాంధ్ర నిరసనే అంటే కాస్త నవ్వొస్తుంది.
వీల్లకు సరిగ్గా సరిపోయేట్లున్న మీడియా..... అది ఏమ్ చూపినా సమైక్యాంధ్ర కోసమే. ఎవడు ఎలా చచ్చినా అది సమైక్యమ్ కొసమే.





ఈ మాత్రమ్ సింగారానికి అధిపత్య పోరొకటి. ఉద్యమమంటే మా కులపోడే చేయాలి అని కొందరు, లేదు మా పార్టీ వాడే చేయాలి అని మరి కొందరు, కాదు కాదు మా లీడరే చేయాలి మరెవరు చేయడానికి వీళ్లేదు అని ఇంకొందరు. కాదంటే తడకా చూపించి తాట తీయడానికి కూడా వెనకాడడమ్ లేదు. 



ఈ సారి ఉద్యమమ్ లో ఎక్కువగా కనబడుతున్నది, ఒక రకమ్‌గా చెప్పాలి అంటే ముందుండి నడిపిస్తున్నది హిజ్రాలు. "సమైక్యాంధ్ర హిజ్రాల జేయేసీ" ఒకటి పెట్టి సమైక్యాంధ్ర వాదులను ఏకమ్ చేయాలని మనవి. 

ఈ మిధ్యమమ్ వేడి అప్పుడే చల్లరినట్లు ఉంది. మొన్నటి వరకు న్యూస్ పేపర్లల్లొ ప్రంట్ పేజీలో కలర్ ఫొటోలు వచ్చేవి, తర్వాత మధ్య పేజీలోకి వెళ్లి పోయాయి. ఇప్పుడు కలర్ ఫోటోలు కాస్తా బ్లాక్ అయిండ్ వైట్ కు మారిపోయాయి. రేపు పూర్తిగా కనబడకుండా పోతాయి. అలా రాష్ట్రమ్ లో జరిగిన కొన్ని అల్లర్లు చరిత్ర పుటల్లో కలిసి పోతాయి.

ఆవేశ పడడమ్ లో తప్పులేదు కానీ ఆ అవేశానికి అర్థమ్ లెక పోతే ఉద్యమానికి ఓ దశ దిశ అంటు ఉండవు. అప్పుడు సమైక్యాంధ్ర కోసమ్ సంకనాకి పోవల్సి వస్తుంది.


No comments:

Post a Comment