అచ్చతెలుగులో నాలుగు పంక్తులు కూడా రాయశాతగాని నేను మీ అందరికి తెలుగు గురువుగా, బ్లాగుల్లో సమైఖ్యాంధ్రకు గల ఏకైక ప్రతినిధిగా కండ్లబడడమ్, నేనేమన్న దానికి మీరంత తప్పెట్లు కొట్టడమ్ నాకు శానా సంతోషం కలిగించే ఇశయమ్. సాటి తెలుగు వానితో తెలుగులోనే మాట్లాడతానని మీ అందరితో ప్రతిజ్ఞ చేపిస్తా కాని, నేను మాత్రం ఇంగిలిపీసు ధారాళంగా మాట్లాడుత. నన్నెవడు అడగడానికి లేదు. ఎవడైనా అడిగితే, నేను ఇంగిలిపీసుల మాట్లాడనని నీకేమైనా చెప్పానా అని బొంకుత. నేనంతేరా భై....... దేడ్ దిమాక్ గద.
ఇన్నిరోజులు ఏడ్చిమొత్తుకున్న ఇప్పుడు తెలంగాణ ఒచ్చుడు ఎవరమ్ ఆపక పోతిమి. కనీస్కమ్ ఇప్పుడొచ్చే సీమాంధ్ర రాష్ట్రానకైనా దిశానిర్దేశం చేస్తూ నేను కొన్ని సూచనలు చేస్తాను. దాన్ని మీరంతా ఆహాఓహో అని, ఆనవాయితీ ప్రకారం తప్పెట్లు కొట్టాలి. అదే వేడిలో నేను రెచ్చిపోయి నా నోటొకొచ్చింది వాగి నా కుతి తీర్చుకుంటా. నాకదో ఆనందమ్. మీకు తెల్వంది కాదు.
రాబోయే రాష్ట్రానికి నేను చేయబోయే సూచనలు.
1) మాతాన ఏమ్ లేకున్న, కొత్తరాజదాని మాత్రం మా ఊరినే ఎన్నుకోవాలి. రాయలసీమకు తెడ్డు సూపాలి
2) ఆ రాజధానికి సున్నంగొట్టి, సర్వాంగ సుందరంగా దిద్ది, ఇప్పుడు హైదరాబాదులో ఉన్న పరిశ్రమలు అక్కడికి తరలించాలి [ఎందుకో నవ్వుతుండ్రు?]
3) ఆంధ్ర సంసృతిని సాంప్రదాయాలని ఇప్పుడు మనం అందరి నెత్తిన రుద్దాలె కాబట్టి అందులో భాగంగా
a) ప్రతి ఊళ్ళోను ఒక పేకాట క్లబ్బు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి
b) ప్రతి జాతరలో రికార్డింగ్ డాన్స్‌లు ఏర్పాటు చేసి తైతక్కలాడాలి
c) కాలేజీల్లో కులసంఘాలు, సినిమా అభిమాన సంఘాలు ఏర్పాటు చేసి, విధ్యార్థులు తన్నుకు చచ్చే ఏర్ఫాటు కలిపించాలి. అందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి.
మీ తెలివితక్కువతనానికి, నా అగ్యానం కలిస్తే, మనకు ఎదురుండదు. రాబోయే రాష్ట్రానికి కాబోయే రాజులం మనమే.